పాక్ లో జైషే మహమ్మద్ అధినేత సోదరుడు హమజ్ అరెస్టు!
- నిషేధిత ‘ఉగ్ర’ సంస్థలకు చెందిన 44 మంది అరెస్టు
- హమజ్ తో పాటు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ కూడా
- పాక్ మంత్రి ప్రకటన
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని ఈరోజు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు హమజ్ కూడా ఉన్నాడు. హమజ్ తో పాటు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి షెహ్ర్యార్ ఖాన్ అఫ్రిది తెలిపారు.