ఆలోచనలో పడిన బోయపాటి!
- బోయపాటి నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో
- ఎన్నికల హడావిడిలో బాలకృష్ణ
- సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం
ఇక ఇటీవల బాలకృష్ణ సొంత బ్యానర్లో వచ్చిన 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' సినిమాలు ఆయనకి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. దాంతో ఇకపై సినిమాల నిర్మాణాన్ని కొనసాగించాలా .. వద్దా? అనే విషయాన్ని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం బోయపాటిని మరింత టెన్షన్ పెడుతోందట. అప్పటికప్పుడు వేరే నిర్మాతను సెట్ చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాకపోవడంతో బోయపాటి ఆలోచనలోపడ్డాడట. ఈ ఏడాది బోయపాటి నుంచి మరో సినిమా వస్తుందా లేదో చూడాలి మరి.