టీటీడీ వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన.. పాలక మండలి ఆమోదం
- 8 సమస్యల పరిష్కారానికి ఆమోదం
- రూ.47.44 కోట్లతో పీఏసీ నిర్మాణం
- జీతాల చెల్లింపునకు రూ.625 కోట్లు
కల్యాణి జలాశయం నుంచి రెండో పైప్‌లైన్ ఏర్పాటుకు పాలక మండలి నుంచి ఆమోదం లభించిందన్నారు. అలాగే తిరుమలలో రూ.47.44 కోట్లతో పీఏసీని నిర్మించనున్నట్టు తెలిపారు. సిబ్బంది జీతాల చెల్లింపునకు రూ.625 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.270 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.235 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు పేర్కొన్నారు.