శ్రీకాకుళంలో బౌన్సర్ల దాడికి నిరసనగా.. 'జబర్దస్త్' ఫేమ్ నరేష్ పై స్థానిక యువకుల దాడి!
- కళింగాంధ్ర ఉత్సవాల సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్
- ప్రదర్శనకు వచ్చిన నరేష్ బృందం
- గ్రీన్ రూమ్ లోకి తొంగిచూసిన యువకులు, అడ్డుకున్న బౌన్సర్లు
- తిరుగు ప్రయాణం వేళ దాడి
ఆపై కార్యక్రమం సజావుగానే సాగినా, తిరుగు ప్రయాణం వేళ, మార్గమధ్యంలో కొందరు స్థానిక యువకులు వారి వాహనాలను అడ్డగించారు. తమను కొట్టి, దూషించారంటూ, వాహనాలపై దాడికి దిగారు. నరేష్ టీమ్ పై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి, ఫిర్యాదు చేశారు. కాగా, జరిగిన ఘటనపై స్పందించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దాడి చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.