విపరీతమైన చలిలో షూటింగ్ .. వెనుకాడని అనుష్క
- అనుష్క ప్రధాన పాత్రధారిగా సస్పెన్స్ థ్రిల్లర్
- కీలక పాత్రలో మాధవన్
- పరిశీలనలో 'సైలెన్స్' టైటిల్
కోన వెంకట్ సమర్పిస్తోన్న ఈ సినిమాలో మాధవన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగు కోసం విదేశాల్లోని కొన్ని లొకేషన్స్ ను ఎంపిక చేశారట. కొన్ని లొకేషన్స్ లో మైనస్ డిగ్రీల చలి వుంటుందట. అంత చలిలో సైతం షూటింగులో పాల్గొనడానికి అనుష్క అంగీకరించిందని సమాచారం. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి, 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.