ఏమండీ... లోకేశ్ కు మీ చానల్ చేస్తున్న భజన... వాహ్!: నాగబాబు సెటైర్ల వీడియో
- నాగబాబు వీడియోను ఆపేయించిన టీడీపీ కార్యకర్తలు
- ఏబీఎన్ చానల్ లో వచ్చిన స్టోరీని మాత్రమే చూపించా
- భజన భటుల్లా మారిన ఏబీఎన్ అంటూ సెటైర్లు
"మీరు దావోస్ లో లోకేశ్ పర్యటనను గురించి రిపోర్టింగ్ ఎలా ఇచ్చారో తెలుసా?... 'మాయాబజార్' చూశారుకదా? 'మాయాబజార్'లో లక్ష్మణ కుమారుడి పక్కన ఇద్దరుంటారు. అల్లు రామలింగయ్యగారు, ఇంకొకాయన... కవచమిది కవచమిది పరమం పవిత్రం... అనే ఇద్దరు భజన భటులుంటారు. మీ చానలు, మీరు చెప్పే భజన ఎబౌట్ నారా లోకేశ్ గురించి, చంద్రబాబు గురించి... అంతకన్నా చెప్పేదేమీ లేదు" అంటూ తనదైన శైలిలో తాళం వాయిస్తూ మాట్లాడారు. 'యూ కెెన్ నెవర్ కిల్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్' అని హెచ్చరించారు.