అఖిల్ తదుపరి సినిమా ఆ దర్శకుడితోనే
- సత్య పినిశెట్టితో అఖిల్ మూవీ
- పూర్తి స్క్రిప్ట్ వినేసిన నాగార్జున
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
ఇదే సమయంలో అఖిల్ తదుపరి సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనే మరో ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలో నిజం లేదని, సత్య పినిశెట్టి దర్శకత్వంలోనే అఖిల్ సినిమా ఖరారైందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ ను నాగ్ పూర్తిగా వినేయడం .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయట. అఖిల్ ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలు ఆయా కారణాల వలన ఎక్కువ గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఆలస్యం చేయరట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి .. ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా చెబుతున్నారు.