మొదట్లో బాధపడేదానిని.. ఇప్పుడు రూమర్స్ అలవాటైపోయాయి: హీరోయిన్ అంజలి
- హీరో 'జై'తో ప్రేమ వ్యవహారం
- మనస్పర్ధలు తలెత్తాయంటూ ప్రచారం
- ఒకప్పుడు ఏడ్చేదానిని
త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వచ్చాయి .. ఆ తరువాత మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వూలో అంజలి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'జై'తో ఆమె ప్రేమ వ్యవహారం గురించి అడిగిన ప్రశ్నకి అంజలి స్పందిస్తూ .. "ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో .. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. కెరియర్ ఆరంభంలో ఇలాంటి పుకార్లకి బాధపడేదాన్ని .. ఏడ్చేదాన్ని కూడా. కానీ ఇప్పుడు అలవాటైపోయాయి. ఎలాంటి పుకార్లయినా కొన్ని రోజులే హల్ చల్ చేస్తాయి .. ఆ తరువాత అంతా మరిచిపోతారు" అంటూ షాక్ ఇచ్చింది.