జయరాం హత్యకు, నాకు ఎలాంటి సంబంధం లేదు: పోలీస్ విచారణలో శిఖా చౌదరి
- హత్య జరిగిన రోజున వికారాబాద్ కు లాంగ్ డ్రైవ్ కి వెళ్లా
- మామయ్య చనిపోయినట్టు అమ్మ ఫోన్ చేస్తే తెలిసింది
- శ్రీకాంత్, నేను కలిసి జయరాం ఇంటికెళ్లాం
జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని తన తల్లి ఆ రోజు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి తనకు చెప్పిందని, దీంతో, శ్రీకాంత్, తాను కలిసి జయరాం ఇంటికెళ్లామని, జగ్గయ్యపేటలో తనకు రాసిచ్చిన పది ఎకరాల భూమి పత్రాల కోసం వెతికామని, ఆ తర్వాత జయరాంను చూసేందుకు విజయవాడ వెళ్లానని, అప్పుడే, బెజవాడ పోలీసులు తనను రమ్మనమని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లానని ఈ విచారణలో శిఖా చౌదరి చెప్పినట్టు తెలుస్తోంది.