జయరాం హత్యకు సైనైడ్ వాడినట్టు అనుమానం.. సూత్రధారి శిఖా చౌదరి!
- శిఖా చౌదరి పేరిట ఆస్తుల బదలాయింపు
- డాక్యుమెంట్లు తన వద్దే ఉంచుకున్న జయరాం
- రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
జయరాం హత్యకు సైనైడ్ వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో చంపి నందిగామ వద్ద రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శిఖా చౌదరి స్నేహితుడు రాకేశ్, డ్రైవర్ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. అయితే హత్య జరిగిన రోజు జయరాం కారులో తెల్ల చొక్కా వ్యక్తి, మహిళ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆ మహిళ శిఖ చౌదరా? లేదంటే వేరొకరా? అనే విషయమై విచారణ కొనసాగుతోంది.