'భారతీయుడు 2'కి తనని తీసుకోకపోవడం పట్ల ఏఆర్ రెహ్మాన్ స్పందన
- కమల్ నాకు ప్రాధాన్యతనిచ్చారు
- శంకర్ .. అనిరుధ్ కి ఛాన్స్ ఇచ్చారు
- వేరే కారణాలంటూ ఏమీ లేవు
అయితే శంకర్ .. అనిరుధ్ ను తీసుకున్నాడు. శంకర్ ఇలా చేయడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై రెహ్మాన్ స్పందించాడు. 'భారతీయుడు 2'కి నేనే పనిచేయాలని కమల్ భావించారు .. కానీ శంకర్ తనకి నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఒకే కాంబినేషన్లో వరుస సినిమాలు చేయడం బోరింగ్ గా ఉంటుందని ఆయన భావించి వుంటారు. '2.ఓ' సినిమా కోసం నేను చాలా అలసిపోయాను. అందువలన నన్ను మరింత కష్టపెట్టకూడదని ఆయన అనుకుని వుంటారు. అంతేతప్ప వేరే కారణాలేమీ లేవు" అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.