దిల్ రాజు బ్యానర్లో నాగచైతన్య
- హిట్ కోసం చైతూ వెయిటింగ్
- చేతిలో 'మజిలీ'.. 'వెంకీమామ'
- కొత్త దర్శకుడితో మరో సినిమా
వెంకటేశ్ తో కలిసి 'వెంకీమామ' చేయడానికి సిద్ధమవుతోన్న ఆయన, మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. గతంలో దిల్ రాజు బ్యానర్లో చైతూ 'జోష్' సినిమా చేశాడు. మళ్లీ ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందన్న మాట. ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేయడం జరిగిపోయిందనీ .. ఒక కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు.