స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలంటూ... శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో రుద్రపూజలు!
- దిండుగల్ జిల్లాలో పూజలు
- ప్రజలను ఆహ్వానిస్తూ కరపత్రాలు
- రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
ఈ పూజలు శనివారం నాడు జరిగినట్టు తెలుస్తుండగా, ఆపై పూజల విషయంలో దుమారం చెలరేగింది. తమ పార్టీ తరఫున ఎలాంటి పూజలూ జరిపించలేదని డీఎంకే చెబుతుండగా, పూజల్లో తాము పాల్గొన్నామని ఆండినాయకన్ వలసు గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తాను సీఎం అయ్యేందుకు పన్నీర్ సెల్వం యాగాలు చేయించారని స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు స్టాలిన్ సీఎం కావాలంటూ పూజలు జరగడం, ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో ఇవి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.