'అసురన్' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న ధనుశ్
- ధనుశ్ హీరోగా 'అసురన్'
- ఈ రోజునే షూటింగ్ మొదలు
- ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్
బ్లాక్ కలర్ బనీను .. గళ్ల లుంగీ పైకి కట్టి .. బల్లెంతో దాడికి దిగుతున్నట్టుగా ఈ పోస్టర్ లో ఆయన కనిపిస్తున్నాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. ఈ సినిమాలో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమిళ నవల 'వెట్కాయ్' ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి, కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.