బైక్ చుట్టూ తిరిగే కథలో విజయ్ దేవరకొండ
- 'డియర్ కామ్రేడ్'తో బిజీగా విజయ్ దేవరకొండ
- తదుపరి సినిమా క్రాంతిమాధవ్ తో
- తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
ఈ ప్రాజెక్టు తరువాత విజయ్ దేవరకొండ ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆ దర్శకుడు విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించాడట. బైక్ చుట్టూ తిరిగే ఆ కథ ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో వెంటనే విజయ్ దేవరకొండ ఓకే చెప్పేశాడని చెబుతున్నారు. కారు చుట్టూ తిరిగే కథతో 'టాక్సీవాలా'గా హిట్ కొట్టేసిన విజయ్ దేవరకొండ, బైక్ చుట్టూ తిరిగే కథతోను రానున్నాడన్న మాట. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో ఒక సినిమా ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి కొరటాల దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.