సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బోర్ కొడుతోందంటున్న కాజల్
- బయోపిక్ కి మాధవన్ దర్శకత్వం
- మణిరత్నం సినిమాలో నాని?
- నెలాఖరు నుంచి నితిన్ 'భీష్మ'
* ప్రముఖ నటుడు మాధవన్ తాను నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ గా వివిధ భాషల్లో రూపొందుతున్న 'రాకెటరీ- ద నంబి ఎఫెక్ట్' చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, దానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ తాజాగా హీరో నానికి వచ్చినట్టు తెలుస్తోంది. మణిరత్నం తన తదుపరి చిత్రం కోసం నానిని సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు.
* నితిన్ హీరోగా నటించే 'భీష్మ' చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసినట్టు సమాచారం. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది.