ఫలించని బొత్స రాయబారం.. వైసీపీని వీడేందుకే వంగవీటి రాధాకృష్ణ మొగ్గు!
- నేడు గంటపాటు చర్చలు జరిపిన సత్తిబాబు
- విజయవాడ సెంట్రల్ సీటుపై పీటముడి
- విజయవాడ ఈస్ట్ కు పోటీ చేయాలంటున్న జగన్
అయితే విజయవాడ సెంట్రల్ ఇస్తేనే పార్టీలో ఉంటానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీంతో బొత్స నిరాశగా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం నేపథ్యంలో ఇటీవల రంగా, రాధా మిత్రమండలి సమావేశం నిర్వహించిన రాధ.. అనుచరులు, మద్దతుదారులతో సుదీర్ఘంగా చర్చించారు. వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరతారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.