మహేశ్ బాబు నా భుజం తట్టి ప్రోత్సహించారు: అనిల్ రావిపూడి
- వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ
- వరుణ్ తేజ్ తో మళ్లీ చేయాలనుంది
- మహేశ్ బాబు గారికి కృతజ్ఞతలు
ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. " వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ .. ఈ జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఆయన టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు .. ఆయనతో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది. ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను .. ఆయనే మహేశ్ బాబు.
ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేశ్ బాబు గారు చేసిన ప్రతి ట్వీట్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాగానే చూసి అభినందించారు. ఆయన ఇలా భుజం తట్టి ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మా టీమ్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.