సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- దుమ్మురేపుతున్న సాయిపల్లవి పాట
- సల్మాన్ ఖాన్ సినిమాలో 'ఈగ' విలన్
- హిట్ సినిమా రీమేక్ లో సమంత, శర్వానంద్
* ప్రముఖ కన్నడ నటుడు 'ఈగ' సుదీప్ మళ్లీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నటించే 'దబాంగ్ 3' చిత్రంలో సుదీప్ విలన్ పాత్రను పోషించనున్నాడు. ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహిస్తాడు.
* ఇటీవల తమిళంలో వచ్చిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత, శర్వానంద్ జంటగా నటించనుండగా, తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ కుమార్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.