వెయ్యి మంది డాన్సర్లతో 'సైరా' సాంగ్
- షూటింగు దశలో 'సైరా'
- 'బాహుబలి' స్థాయి ప్రాజెక్టు
- ప్రత్యేకమైన పాట కోసం భారీ సెట్
ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం తరువాత ఒక పాట రానుందని చెబుతున్నారు. ఈ పాటను చిరంజీవి .. ముఖ్య పాత్రధారులతో పాటు వెయ్యిమంది డాన్సర్లు .. మరో వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కథను బట్టి ఇది స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను పెంచే పాట కావొచ్చు .. లేదంటే గూడెంలో జరిగే జాతర తరహా సాంగ్ లాంటిదైనా కావొచ్చు. ఈ పాట కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారట. అది పూర్తికాగానే చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు.