మా నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది: బ్రహ్మానందం కుమారుడు గౌతమ్
- గుండె ఆపరేషన్ విజయవంతంగా చేశారు
- ప్రముఖ వైద్యుడు రమాకాంత్ పాండా ఆపరేషన్ చేశారు
- అందరి ఆశీస్సుల వల్లే ఆరోగ్యం మెరుగైంది
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగిందని తెలిపారు. తన తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల తన తండ్రి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని చెబుతూ, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు, ఆయన కుటుంబసభ్యులు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.