'దటీజ్ మహాలక్ష్మి' నుంచి లిరికల్ వీడియో
- హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
- తెలుగు రీమేక్ గా 'దటీజ్ మహాలక్ష్మి'
- ఆకట్టుకుంటోన్న లిరికల్ వీడియో
'మహాలక్ష్మి'కి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లకి సంబంధించిన విజువల్స్ తో ఈ లిరికల్ వీడియోను కట్ చేశారు. సందడిగా .. సంబరంగా కొనసాగే ఈ పాటకి సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాణీ కట్టగా, గీతామాధురి ఆలపించింది. సాహిత్యాన్ని కృష్ణకాంత్ అందించాడు. గతంలో హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్' సినిమాకి ఇది రీమేక్. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి.