మొదటి సినిమా సమయంలో ఏడ్చేశాను: హీరోయిన్ స్నేహ
- ముంబైలో పుట్టిపెరిగాను
- అసలు పేరు సుహాసిని
- ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం
నా అసలు పేరు సుహాసిని రాజా రామ్ నాయుడు. నేను పుట్టి పెరిగింది ముంబైలో. ఆ తరువాత కొంతకాలం దుబాయ్ లో వుండి, చెన్నైకి వచ్చాము. ఇంటర్ పూర్తయిన తరువాత నేను సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్ అయితే లైఫ్ స్టైల్ భలేగా ఉంటుందని అందరూ అనుకుంటారు. నేనూ అలాగే అనుకుని వచ్చాను కానీ మొదటి సినిమా చేస్తుండగానే ఇక్కడ నెగ్గుకు రావడం ఎంత కష్టమో తెలిసింది. దాంతో ఇక సినిమాలు చేయకూడదని అనుకున్నాను. చేయనని చెప్పేసి ఏడ్చేశాను కూడా. అమ్మానాన్నలు సపోర్ట్ గా నిలబడటంతో నెమ్మదిగా సర్దుకుపోయాను." అని చెప్పుకొచ్చారు.