44 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బీహార్ స్పిన్నర్.. 68 వికెట్లు పడగొట్టిన అమన్
- 44 ఏళ్ల క్రితం 64 వికెట్లు పడగొట్టిన బిషన్ సింగ్ బేడీ
- సరికొత్త రికార్డు సృష్టించిన అశుతోష్
- మణిపూర్‌పై బీహార్ గెలుపు
మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సగత్‌పమ్ సింగ్‌ను ఎల్బీగా అవుట్ చేసిన అశుతోష్ రంజీల్లో సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బీహార్ 3 వికెట్ల తేడాతో మణిపూర్‌పై విజయం సాధించింది. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అయిన అమన్ రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లలో 6.48 సగటుతో 68 వికెట్లు తీసుకున్నాడు.