బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు సంచలనం.. ‘ఎర్రోడి వీరగాథ’ షార్ట్ ఫిలిం విడుదల
- గతంలోని బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్
- మూడు నిమిషాల నిడివి
- సోషల్ మీడియాలో ప్రకంపనలు
‘ఎర్రోడి వీరగాథ’ మూడున్నర నిమిషాల నిడివి ఉంది. ఇందులోని ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని కొడుతుంటారు. వారిని అడ్డుకున్న నాగబాబు ఎందుకలా కొడుతున్నారని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. దానికి అతడు చెప్పిన సమాధానం విని నాగబాబు ఆశ్చర్యపోతాడు. ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా’ అని పెద్దలు చెప్పారని, అందుకే ముద్దు అడిగానని అతడు చెబుతాడు. దీంతో షాకైన నాగబాబు ఆడవాళ్లను పిలిచి మరీ అతడిని చితక్కొట్టిస్తాడు.