ఏపీలో 'వినయ విధేయ రామ' స్పెషల్ షోలకి అనుమతి
- ఈ నెల 11వ తేదీన భారీ రిలీజ్
- చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
- హిట్ ఖాయమంటోన్న చరణ్ ఫ్యాన్స్
ఈ పండుగ రోజులలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ అదనంగా మరో రెండు షోలు వేస్తారు. ఇలా అదనపు షోలకి అనుమతి లభించడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుంది. బోయపాటి మార్క్ మాస్ అంశాలు .. చరణ్ యాక్షన్ .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా తప్పకుండా చరణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.