విమానంలో తోటి ప్రయాణికురాలిపై వ్యాపారవేత్త లైంగిక వేధింపులు
- అరవై అయిదేళ్ల వ్యాపార వేత్త నిర్వాకం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
- విస్తారా విమానంలో ఘటన
వ్యాపారవేత్త అనిల్‌కుమార్ మూల్ చందానీ ముంబయి వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఆమె పక్క సీటులో 41 ఏళ్ల యువతి కూర్చుంది. ప్రయాణ సమయంలో అనిల్ ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. ఆమెను ఎక్కడెక్కడో అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. దీంతో ముంబయిలో దిగగానే బాధితురాలు సహారా విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అనిల్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.