యూత్ ను ఆకట్టుకునే 'ప్రేమకథా చిత్రం 2'లోని పాట
- అనంత్ శ్రీరామ్ సాహిత్యం
- సంగీత దర్శకుడిగా జీవన్ బాబు
- నందిత శ్వేత నటన ప్రత్యేక ఆకర్షణ
నాయకా నాయికల మనసులోని ప్రేమ భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతోంది. జీవన్ బాబు సంగీతం .. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. రాహుల్ - రమ్య బెహ్రా ఆలాపన ఈ పాటకు ప్రాణం పోశాయి. యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ వుంది. నందిత శ్వేత నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. గతంలో హిట్ కొట్టిన హారర్ కామెడీ 'ప్రేమకథా చిత్రం' సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా మాదిరిగానే ఈ సీక్వెల్ కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.