'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు
- మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'పేట'
- రేపు రాత్రి 7 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్
- జనవరి 10వ తేదీన భారీ విడుదల
రేపు (ఆదివారం) రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - సైబర్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా పాత్రలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి.