కోడిపందాలు కావాలంటూ గోదావరి జిల్లాల్లో ప్లెక్సీలు!
- జల్లికట్టు తరహాలో అనుమతి ఇవ్వండి
- కోరుతున్న 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ'
- పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు
ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ప్లెక్సీలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఆంధ్రాలో సంక్రాంతి పండగ రోజులలో కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ' పేరిట ఇవి వెలిశాయి.