విజయ్ సినిమాలో 16 మంది కొత్త అమ్మాయిలు!
- స్పోర్ట్స్ నేపథ్యంలో అట్లీ కుమార్ మూవీ
- కోచ్ పాత్రలో కనిపించనున్న విజయ్
- మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు
16 మంది అమ్మాయిలు కలిగిన టీమ్ కి విజయ్ కోచ్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం 16 మంది కొత్త అమ్మాయిలనే తీసుకోవాలనే ఆలోచనలో అట్లీ కుమార్ వున్నాడని చెబుతున్నారు. ఆ అమ్మాయిల పాత్రలకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయట. వివేక్ తో పాటు యోగిబాబు నటించనున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగు కోసం సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో విజయ్ .. అట్లీ కుమార్ కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు వున్నాయి.