ఆకట్టుకుంటోన్న 'దేవ్' లిరికల్ వీడియో సాంగ్
- 'ఖాకీ'తో హిట్ కొట్టిన జోడీ
- 'దేవ్' గా ప్రేక్షకుల ముందుకు
- సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్
గతంలో కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' తమిళంతో పాటు తెలుగులోను విజయాన్ని దక్కించుకుంది. అందువలన ఇప్పుడు కూడా తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ వుంది .. రకుల్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఇది తెలుగులో భారీ వసూళ్లనే సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోడీకి మరో హిట్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.