సుధీర్ వర్మతో శర్వానంద్ .. టైటిల్ పై జరుగుతోన్న కసరత్తు
- మాఫియా డాన్ గా శర్వానంద్
- 50 శాతానికి పైగా జరిగిన చిత్రీకరణ
- ఏప్రిల్లో విడుదల చేసే ఛాన్స్
ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్ గా కనిపించనుండటం వలన, 'దళపతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ ను వేరే నిర్మాత రిజిష్టర్ చేయించుకుని ఉండటం వలన, ప్రస్తుతం 'నాయకుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ టైటిల్ వలన ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగే ప్రమాదముందనే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను ఓకే చేసి, ఫస్టులుక్ ను విడుదల చేసేలా చూస్తున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.