వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ ల డ్యాన్స్.. వీడియో చూడండి
- నిన్న 53వ పుట్టినరోజును జరుపుకున్న సల్మాన్ ఖాన్
- పార్టీకి తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు
- డ్యాన్స్ చేసి అదరగొట్టిన సల్మాన్, సుస్మితా సేన్
ఈ సందర్భంగా సల్మాన్ తో కలసి సుస్మితా సేన్ చేసిన డ్యాన్స్ అందరినీ ఉర్రూతలూగించింది. ఈ వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. 'మాకు డ్యాన్స్ చేసే అవకాశాన్ని జీవితం ఎప్పుడు కల్పించినా... మేము డ్యాన్స్ చేస్తాం. మంచి హృదయం ఉన్న సల్మాన్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను ఎప్పటికీ అభిమానిస్తుంటాననే విషయం నాకు తెలుసు' అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్, సుస్మితలు 'బీవీ నెంబర్ 1', 'మైనే ప్యార్ క్యో కియా' సినిమాల్లో కలసి నటించారు.