విదేశాల్లోను 'విశ్వాసం' విడుదల
- క్రేజీ కాంబినేషన్లో 'విశ్వాసం'
- రష్యా .. ఉక్రెయిన్లలోను విడుదల
- భారీ ఓపెనింగ్స్ ఖాయమంటోన్న ఫ్యాన్స్
గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అందువలన ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న 'విశ్వాసం'పై అంచనాలు బాగానే వున్నాయి. అటు అజిత్ కి గల క్రేజ్ .. ఇటు నయనతారకి గల ఇమేజ్ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో అజిత్ కి మరో సూపర్ హిట్ పడుతుందనే నమ్మకంతో అజిత్ అభిమానులు వున్నారు.