నిన్న ధర్మపోరాట దీక్ష సందర్భంగా చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద నాటు బాంబు.. పోలీసుల టెన్షన్!
- తొలుత గుర్తించిన స్థానికులు
- పందులను బెదరగొట్టేందుకు వాడేదిగా గుర్తింపు
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
దీన్ని తొలుత హెలిప్యాడ్ సమీపంలో గుర్తించిన స్థానికులు అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది తోటలో పంటలను నాశనం చేయకుండా పందులను బెదరగొట్టేందుకు వాడే నాటు బాంబు అయ్యుండొచ్చని తెలుస్తోంది. కాగా, పోలీసుల నిఘా పటిష్టంగా ఉన్నప్పటికీ ఏకంగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దే ఈ వస్తువు కనిపించడంతో కలకలం రేగింది.