ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కొత్త పోస్టర్ .. తారకరాముడితో బసవతారకం!
- రేపు సాయంత్రం ఆడియో వేడుక
- జనవరి 9న 'కథానాయకుడు'
- ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు'
ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ఆరంభం కానుంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవ భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరియర్లో రెండు ప్రత్యేకమైనవిగా మిగిలిపోతాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.