తీవ్ర పోటీ మధ్య.. 'మారి 2' విడుదలకి సిద్ధం!
- సెన్సార్ పూర్తిచేసుకున్న 'మారి 2'
- ధనుశ్ జోడీగా సాయిపల్లవి
- ఈ నెల 21వ తేదీన విడుదల
తమిళంలో మాస్ హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. 'మారి 2' కూడా మాస్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధనుశ్ సినిమాల్లో 'రఘువరన్ బీటెక్' మాత్రమే తెలుగులో సక్సెస్ అయింది. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా 21వ తేదీన రావడానికే ఆయన సిద్ధమవుతున్నాడు. 'పడి పడి లేచే మనసు' .. 'అంతరిక్షం' .. 'కేజిఎఫ్' పోటీని తట్టుకుని 'మారి 2' నిలబడవలసి ఉంటుంది.