నిహారిక 'సూర్యకాంతం' నుంచి ఫస్టులుక్
- నిహారిక ప్రధాన పాత్రగా 'సూర్యకాంతం'
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న డిఫరెంట్ కాన్సెప్ట్
- కొత్త సంవత్సరం ఆరంభంలో విడుదల
నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. కథానాయకుడిని ఆరాధనా పూర్వకంగా చూస్తూ .. ఆ తరువాత ఆయనని టార్చర్ పెడుతూ ఈ పోస్టర్లో నిహారిక కనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఆసక్తికరమైన టైటిల్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి.