షూటింగులో ప్రమాదం నుంచి బయటపడిన విజయ్ దేవరకొండ
- షూటింగు దశలో 'డియర్ కామ్రేడ్'
- మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
- ట్రైన్ సీన్ షూటింగులో ప్రమాదం
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి టీమ్ సభ్యులంతా షాక్ అయ్యారు. విజయ్ దేవరకొండ వెంటనే తేరుకుని 'ఫరవాలేదు' అని చెప్పడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ దేవరకొండ ఎడమ చేతికి .. కుడికాలుకి దెబ్బలు తగిలాయి. షూటింగ్ అనంతరం హోటల్ కి చేరుకున్న ఆయన, ఎడమ చేతికి తగిలిన దెబ్బలు చూపిస్తూ .. సోషల్ మీడియాలోఒక ఫోటో పోస్ట్ చేశాడు. 'లైఫ్ లో ఏదీ ఈజీగా రాదు' అంటూ ఒక కామెంట్ పెట్టాడు. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించనున్నాడు.