ముగ్గురు హీరోలను ఒప్పించే పనుల్లో హరీశ్ శంకర్
- తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండా'
- గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా రష్మిక మందన
ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్న హరీశ్ శంకర్, నాగశౌర్య - రాజ్ తరుణ్ లను హీరోలుగా తీసుకోవడానికి గాను సంప్రదింపులు మొదలుపెట్టాడు. ఇక విలన్ పాత్రకి గాను వరుణ్ తేజ్ ను ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదట.