ట్రైలర్ తో శర్వానంద్ .. సాయిపల్లవి వచ్చేస్తున్నారు
- హను రాఘవపూడి నుంచి ప్రేమకథా చిత్రం
- రేపు ఉదయం ట్రైలర్ రిలీజ్
- ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
సాధారణంగా కథాకథనాల్లో కొత్తదనం లేకపోతే అటు శర్వానంద్ గానీ .. ఇటు సాయిపల్లవి గాని అంగీకరించరు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి చేశారంటే కాన్సెప్ట్ లో విషయముందనే అనుకుంటున్నారు. శర్వానంద్ .. సాయిపల్లవి ఇద్దరూ కూడా చెరో హిట్ తరువాత చేస్తోన్న సినిమా ఇది. ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాతో హిట్ అందుకుంటారేమో చూడాలి మరి.