ఇంత హవాలోనూ ఓటమి దారిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే!
- ఓటమి బాటలో మంత్రి జగదీశ్ రెడ్డి
- స్పీకర్ మధుసూదనాచారి, పిడమర్తి రవి కూడా
- జలగం వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డిలదీ అదే దారి
ఇదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున పోటీ పడిన పిడమర్తి రవి సైతం వెనుకంజలో ఉండగా, ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఆధిక్యంలో ఉన్నారు.
ఇక కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కన్నా కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ముందంజలో ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఓటమి బాటలో ఉన్నారు.