24... 20... 18... అంతకంతకూ తగ్గుతున్న కాంగ్రెస్ లీడ్!
- తొలుత 24 చోట్ల కాంగ్రెస్ లీడ్
- ఇప్పుడు 18 చోట్లకు పరిమితం
- మూడు చోట్ల మాత్రమే ఎంఐఎం ప్రభావం
ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల జాబితాలో ఉంటారని భావించిన కుందూరు జానారెడ్డి (నాగార్జున సాగర్), మహిళకు అవకాశం వస్తే సీఎం పదవి దక్కుతుందని భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి (కోదాడ)లతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు వెనుకబడివున్నారు. కనీసం 7 స్థానాలు గ్యారెంటీగా గెలుస్తుందని భావించిన ఎంఐఎం, ప్రస్తుతం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది.