ఇల్లు గడవడం కోసం చేతికి వున్న గాజులు అమ్మేశాను: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ
- మమ్మల్ని వదిలేసి నాన్న వెళ్లిపోయాడు
- తినడానికి తిండి ఉండేది కాదు
- అందుకే చెన్నై వదిలి రాలేదు
ఇల్లు గడవడం కోసం చేతికి వున్న గాజులు .. ఉంగరం కూడా అమ్మేశాను. ఒక్కోసారి చేతిలో డబ్బు .. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తెలుగు సినిమాలు చేస్తోన్న సందర్భంలో రామానాయుడు గారు .. రాఘవేంద్రరావుగారు నైతికంగా నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. వాళ్లు అందించిన సహకారాన్ని మరిచిపోలేను. తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి వెళ్లిపోయింది. తమిళ సినిమాల్లో వేషాలు ఎక్కువగా వస్తుండటంతో నేను చెన్నైలోనే వుండి పోయాను" అని చెప్పుకొచ్చారు.