రెండవసారి కూడా మంచి రేటింగును రాబట్టిన 'గీతగోవిందం'
- అందరినీ ఆకట్టుకున్న ప్రేమకథ
- విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన సినిమా
- రెండవసారి కూడా భారీ రేటింగ్
ఇక ఏ సినిమా అయినా రెండవసారి బుల్లితెరపై ప్రసారమైనప్పుడు రేటింగ్ విషయంలో భారీ తేడా కనిపిస్తూ ఉంటుంది. కానీ 'గీతగోవిందం' విషయంలో అలా జరగలేదు. ఇటీవల జీ తెలుగువారు రెండవసారి ఈ సినిమాను ప్రసారం చేసినప్పుడు 17.16 టీఆర్పీని రాబట్టింది. తొలిసారి సాధించిన రేటింగుకి .. రెండవసారి రాబట్టిన రేటింగుకి మధ్య తేడా చాలా తక్కువగా ఉండటం విశేషం. మొత్తానికి 'గీతగోవిందం' ఇంకా తన సత్తాను చాటుతునే ఉందన్న మాట.