విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు దర్శకుల వెయిటింగ్
- 'డియర్ కామ్రేడ్'తో విజయ్ దేవరకొండ
- చేతిలో రెడీగా రెండు ప్రాజెక్టులు
- పోటీపడుతోన్న దర్శకులు
ఇప్పటికే విజయ్ దేవరకొండకి పూరి ఒక కథను వినిపించాడట. ఇక మారుతి రెండు మూడు కథలు సిద్ధం చేసుకుని .. విజయ్ దేవరకొండకి ఏది నచ్చితే అది లాక్ చేయాలనే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. గోపీచంద్ మలినేని కూడా ఒక కథపై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఆ కథను త్వరలోనే విజయ్ దేవరకొండకి వినిపించనున్నాడని అంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ విషయంలో దర్శకుల మధ్య గట్టిపోటీనే వుందన్న మాట.