రూ.200 కోట్ల క్లబ్లో ‘2.ఓ’.. మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న రజనీ
- మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్
- తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు
- హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు
వీకెండ్ కూడా కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. రజనీకాంత్ మరో రికార్డ్ కూడా సాధించారు. ఆయన నటించిన రోబో, కబాలి చిత్రాలు కూడా రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాయి. దక్షిణాదిలో రూ.200 కోట్లు రాబట్టిన మూడు సినిమాలున్న కథానాయకుడుగా రజనీ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నారు.