బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి: నటుడు పృథ్వి సెటైర్
- గణేష్ రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది
- మహాకూటమి గెలిస్తే.. అమరావతి నుంచి పాలన ఉంటుంది
- కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవి
కేసీఆర్ మగాడని, విజయమే లక్ష్యంగా ఆయన ప్రయాణం ఉందని పృథ్వి చెప్పారు. అధికారం కోసమే మహాకూటమి ఏర్పడిందని... కేసీఆర్ కు అలాంటి అనైతిక కలయికలు లేవని అన్నారు. తెలంగాణలో మహాకూటమికి ఓటు వేస్తే... పరిపాలన అమరావతి నుంచి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కేవలం ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవని అన్నారు.