నందమూరి సుహాసినికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం: సర్వే సత్యనారాయణ
- కాంగ్రెస్ కేబినెట్లో సుహాసినికి స్థానం
- ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి: పెద్దిరెడ్డి
- రాక్షస పాలనకు చరమగీతం పాడండి: సుహాసిని
కంటోన్మెంట్ నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశానుసారం పోటీ చేస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. కంటోన్మెంట్ నుంచి తన గెలుపు ఖాయమన్న ఆయన మల్కాజిగిరి నుంచి టీడీపీ నేత పెద్దిరెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తే ఆయన గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సుహాసినిని ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే స్థానికంగా ఉండి సేవ చేస్తానని, మహిళలకు అండగా ఉంటానని సుహాసిని హామీ ఇచ్చారు. మహాకూటమిని గెలిపించి ప్రస్తుత రాక్షస పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.